5, ఏప్రిల్ 2015, ఆదివారం

పరిశ్రమల స్థాపనకు ఏపీ అనుకూలం..

చిత్తూరుజిల్లా సత్యవేడులోని శ్రీసిటీసెజ్ లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెప్సికో యూనిట్ ను ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ వేడుకలో పెప్సీకో సీఈఓ ఇంద్రనూయి ఏపీ మంత్రి నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే పదేళ్లలో దేశంలోనే అతి పెద్ద పారిశ్రామికవాడగా శ్రీసిటీ అభివృద్ధి చెందుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో పెద్ద సముద్ర తీరం ఉన్నందున పరిశ్రమల ఏర్పాటుకు చాలా అనుకూలంగా ఉంటుందన్నారు. ఏపీని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని, రాష్ట్రాభివృద్ధికి అందరూ కృషి చేయాలని అన్నారు. 

బాహుబలి సీన్స్ లీక్... రాజమౌళికి నోటీసులు...?!

ఆశ్చర్యపోకండి.. నిజంగానే దర్శకుడు రాజమౌళికి హైదరాబాద్‌లో సిసిఎస్‌ పోలీసులు నోటీసులు జారీచేయనున్నారు. విషయం ఏమంటే... ప్రతిష్టాత్మకంగా దర్శకత్వం వహించిన 'బాహుబలి' సినిమా గురించి. జనవరిలో చిత్ర నిర్మాత పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సినిమాలోని యుద్ధ సన్నివేశాలు కొన్ని బయటకు వచ్చాయి. ఇవి గత నెలలో పోలీసులు శోధించి.. గ్రాఫిక్స్‌ వర్క్‌లో పనిచేస్తున్న మూర్తి ద్వారా వచ్చాయని నిర్ధారణ చేశారు. కానీ అతను ప్రస్తుతం పనిచేయడం లేదట. 
 
బయటకు వచ్చిన సీన్స్‌ పోలీసుల వద్ద వున్నాయి. ని
prabahs-baahubaliర్మాత ఫిర్యాదు మేరకు పోలీసులు రాజమౌళిని పిలిపించి.. అసలు బాహుబలిలోని నిజమైన సీన్స్‌ బయటకు వచ్చాయా? లేక ఇదేమైనా డ్రామానా? అని లేదంటే.. మూర్తి డూప్లికేట్‌గా సీన్స్‌ బయటకు తెచ్చాడా? అనేది ఆరా తీయనున్నారు.
 
ఇవి తెలవాలంటే.. ముందుగానే రాజమౌళిని పోలీసు కార్యాలయానికి పిలిపించాలి. అందుకు ముందుగా నోటీసులు ఇవ్వాలి.. అదన్నమాట. మరో రెండు రోజుల్లో రాజమౌళికి నోటీసులు ఇస్తామని.. ఆయన వచ్చి తమకు క్లారిటీ ఇస్తే సరిపోతుందనీ, లేకపోతే... ఇవి మార్ఫింగ్‌ చేసిన దృశ్యాలుగానే పరిణగణిస్తూ... ఇంత గొడవ చేసినందుకు తిరిగి కేసు కూడా పెట్టవచ్చని నిర్మాతకు సూచించారట. బాహుబలి లీకుల గొడవ ఎంతవరకు వెళుతుందో మరి...!!

కేంద్ర పన్నుల వాటలు విడుదల.. ఆంధ్రాకు రూ. 1616 కోట్లు, తెలంగాణకి రూ. 915 కోట్లు..!

2015 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రాల పన్నుల వాటాను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్రాల అభివృద్ధిలో కేంద్రం భాగస్వామి అవుతుందని పేర్కొన్న విధంగా మోడీ ప్రభుత్వం దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన తొలి విడత పన్నులవాటాను పంపిణీ చేసింది.
 
దేశంలోని అన్ని రాష్ట్రాలకు 37,420 కోట్ల రూపాయలు విడుదల చేయగా, ఆ మొత్తంలో రెండు తెలుగు రాష్ట్రాలకు 2,531 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందులో 1616 కోట్లను ఆంధ్రప్రదేశ్ పన్నుల వాటాగానూ, 915 కోట్ల రూపాయలను తెలంగాణ పన్నుల వాటాగా కేంద్రం నిర్ణయించింది. కాగా, ఏప్రిల్ ఒకటో తేది నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన సంగతి తెలిసిందే.

గుజరాత్ తీరంలో రెండు నౌకలు మునక.. 17 మందిని రక్షించిన భారత కోస్ట్ గార్డ్..!

యెమెన్‌లో అంతర్యుద్ధం కొనసాగుతుండడంతో అక్కడ ఉన్న ఇతర దేశాలకు చెందిన వారు ఆయా దేశాలకు తిరిగి వెళుతున్నారు. ఈ స్థితిలో యెమెన్ నుంచి 17 మంది సిబ్బందితో అలాంగ్-సోసియాకు బయల్దేరిన రెండు నౌకలు గుజరాత్‌లోని ఆమ్రేలి జిల్లా తీర ప్రాంతంలో శనివారం మునిగిపోయాయి. 
 
గుజరాత్ తీర ప్రాంతంలో పిపావాలోని ఐసీజీ స్టేషన్‌కు రెండు నౌకలు ప్రమాదంలో ఉన్నట్లు ఉదయం 10.35 నిమిషాలకు మేసేజ్ పంపారు. మేసేజ్ అందుకున్న పిపావాలోని పోర్ట్ అధికారులు, పిపావా మెరైన్ పోలీస్ స్టేషన్‌లకు సమాచారం అందించారు. 
 
వెంటనే భారత కోస్ట్ గార్డ్‌కు చెందిన రెండు పెట్రోలింగ్ బోట్స్ ప్రమాద ప్రాంతానికి వెళ్లగా యెమెన్ కార్గో నౌకలు మునిగిపోతూ కనిపించాయి. దీంతో భారత రక్షక దళం హుటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకొని, ఆ నౌకల్లోని 17 మందిని రక్షించాయి. వీరిలో పాకిస్ధాన్, ఇరాన్, యెమెన్ దేశాలకు చెందిన పౌరులు ఉన్నట్టు తీర రక్షక దళం తెలిపింది. వీరందరిని క్షేమంగా ఆయా దేశాల రాయబారి కార్యాలయాలకు అప్పగించనున్నట్లు సమాచారం. కాగా శనివారం ఒక్క రోజే యెమెన్‌లో ఉన్న 300 మంది భారతీయులు సురక్షితంగా తిరిగివచ్చారు.

పరిశ్రమల స్థాపనకు ఏపీ అనుకూలం..

చిత్తూరుజిల్లా సత్యవేడులోని శ్రీసిటీసెజ్ లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెప్సికో యూనిట్ ను ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ వేడుకలో పెప్సీకో సీఈఓ ఇంద్రనూయి ఏపీ మంత్రి నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే పదేళ్లలో దేశంలోనే అతి పెద్ద పారిశ్రామికవాడగా శ్రీసిటీ అభివృద్ధి చెందుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో పెద్ద సముద్ర తీరం ఉన్నందున పరిశ్రమల ఏర్పాటుకు చాలా అనుకూలంగా ఉంటుందన్నారు. ఏపీని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని, రాష్ట్రాభివృద్ధికి అందరూ కృషి చేయాలని అన్నారు. 

పరిశ్రమల స్థాపనకు ఏపీ అనుకూలం..

చిత్తూరుజిల్లా సత్యవేడులోని శ్రీసిటీసెజ్ లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెప్సికో యూనిట్ ను ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ వేడుకలో పెప్సీకో సీఈఓ ఇంద్రనూయి ఏపీ మంత్రి నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే పదేళ్లలో దేశంలోనే అతి పెద్ద పారిశ్రామికవాడగా శ్రీసిటీ అభివృద్ధి చెందుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో పెద్ద సముద్ర తీరం ఉన్నందున పరిశ్రమల ఏర్పాటుకు చాలా అనుకూలంగా ఉంటుందన్నారు. ఏపీని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని, రాష్ట్రాభివృద్ధికి అందరూ కృషి చేయాలని అన్నారు. 

ఢిల్లీలో హై అలర్ట్...

దేశ రాజధాని ఢిల్లీ నగరంలో కేంద్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. ఉగ్రవాదులు దాడులకు పాల్పడే ప్రమాదం ఉందని పేర్కొంటూ ఇంటెలిజెన్స్ బ్యూరో విభాగం నుంచి రహస్య సమాచారం అందింది. ఢిల్లీలో జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ బాంబు దాడులకు పాల్పడే ప్రమాదం ఉందని సూచించింది. 
 
జనాభ అధికంగా సంచరించే రైల్వే స్టేషన్‌లు, బస్టాండు ప్రాంతాల్లో బాంబులు పేల్చే ప్రమాదం ఉన్నట్టు తెలిపింది. కనుక అప్రమత్తంగా ఉండాలంటూ కేంద్రాన్ని హెచ్చరించింది. దీంతో ఢిల్లీ పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. నగరంలో హై అలెర్ట్‌ను ప్రకటించారు.